''ఖైదీ నెంబర్ 150''.. ప్రీ రిలీజ్‌లోనే రూ.150కోట్లు సంపాదించేసిందా? ఫ్యాన్స్ పండగే పండగ..
టాలీవుడ్ టాప్ హీరోలు వంద కోట్ల క్లబ్‌లో చేరేందుకు నానా తంటాలు పడుతున్న తరుణంలో.. మెగాస్టార్ చిరంజీవి తన ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రూ.150కోట్ల కలెక్షన్లను రాబట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఇ
టాలీవుడ్ టాప్ హీరోలు వంద కోట్ల క్లబ్‌లో చేరేందుకు నానా తంటాలు పడుతున్న తరుణంలో.. మెగాస్టార్ చిరంజీవి తన ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రూ.150కోట్ల కలెక్షన్లను రాబట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈసినిమా హక్కులను వైజాగ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏరియాల్లో ఆల్ టైం రికార్డ్ రేట్లకు అమ్మినట్లు వార్తలొస్తున్నాయి.
ఇక నైజాం ఏరియా కృష్ణా జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల పార్టనర్ షిప్ బేసిస్‌గా గీతా ఫిలిమ్స్ విడుదల చేస్తుందని టాక్ వస్తోంది. ఇప్పటికే మెగా 150వ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే రూ.62 కోట్ల వరకు సంపాదించేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మెగాస్టార్ సినిమా ద్వారా తప్పకుండా టాలీవుడ్ బిజినెస్ చాలా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.100 కోట్ల వ్యాపారం చేసేస్తున్నాడు ఈ ఖైదీ అంటూ మెగా కాంపౌండ్ వ్యూహాత్మక లీకులు వదులుతోంది. ఇక శాటిలైట్ ఆడియో డబ్బింగ్ రైట్స్ అన్నీ కలుపుకుంటే మరో 20 కోట్లు వస్తాయని భారీ అంచనాలు వేసుకుంటోంది మెగా కాంపౌండ్. దీనితో ఈసినిమా విడుదల కాకుండానే 'ఖైదీ' కౌంటింగ్ ఇప్పటికే 120 కోట్లను దాటిపోయిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
మరోవైపు 'ఖైదీ నెంబర్ 150' ని మాటివి రూ.14 కోట్లకు కొనుగోలు చేసుకుందని.. మాటీవీతో చిరంజీవికి ఉన్న సన్నిహిత సంబంధాలు వల్ల ఈ మెగా ఆఫర్ వచ్చిందని సినీ పండితులు చెప్తున్నారు. దీంతో కలుపుకుంటే చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' కి విడుదల కాకుండానే దాదాపు 150 కోట్ల బిజినెస్ జరిగిపోయిందని సినీ వర్గాల్లో టాక్.