Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటం సాంగ్ చేస్తా.. నేనడిగినంత ఇవ్వాలి.. సన్నీలియోన్ :: హీరో విజయ్ షాక్

తన అందాల విందుతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ బాంబ్‌ సన్నీలియోన్‌ ఓ కోలీవుడ్ హీరోకు గట్టి షాక్ ఇచ్చింది. త‌న అంద‌చందాల‌తో దేశ‌వ్యాప్తంగా ఎంతోమందికి శృంగార‌దేవ‌త‌గా మారిపోయిన స‌న్నీలియ

Advertiesment
Sunny Leone
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (12:07 IST)
తన అందాల విందుతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ బాంబ్‌ సన్నీలియోన్‌ ఓ కోలీవుడ్ హీరోకు గట్టి షాక్ ఇచ్చింది. త‌న అంద‌చందాల‌తో దేశ‌వ్యాప్తంగా ఎంతోమందికి శృంగార‌దేవ‌త‌గా మారిపోయిన స‌న్నీలియోన్‌ను ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజయ్‌ నటిస్తున్న 'భైరవ' సినిమాలో ఒక ఐటమ్‌ సాంగ్‌ కోసం సంప్రదించగా, ఆమె డిమాండ్‌ చేసిన పారితోషకం విని యూనిట్‌‌కి దిమ్మదిరిగిపోయిందట. 
 
ఈ సాంగ్‌లో న‌టించేందుకు త‌న‌తో పాటు వ‌చ్చే త‌న 10 మంది స‌హాయ‌కుల‌కు అద‌న‌పు రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని… అలాగే వారికి త‌న‌తో పాటు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కూడా డిమాండ్ చేసిందట. ఈ కండీష‌న్ల‌తో పాటు తాను అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇస్తేనే తానే ఐటెం సాంగ్ చేస్తాన‌ని తేల్చి చెప్పేసింద‌ట. ఆమె పెట్టిన కండీష‌న్ల‌కు చిత్ర‌యూనిట్‌కు దిమ్మ తిర‌గ‌డంతో వారు మరో ఐటమ్‌ గర్ల్‌ కోసం వెతుకులాట ప్రారంభించారట. గతంలో యువ నటుడు జై నటించిన 'వడకర్రి'లో చిందులేసిన సన్నీ... అగ్రహీరో విజయ్‌ చిత్రానికి నో చెప్పడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య చిత్రంలో సెంచరీ స్టార్... సంక్రాంతి రేస్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి'