Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

Advertiesment
Narsimhudu, Akhanda 2 functions

దేవి

, శనివారం, 6 డిశెంబరు 2025 (12:54 IST)
Narsimhudu, Akhanda 2 functions
ఈ సినిమా ఇండస్ట్రీ కి ఏమయింది? ఒకవైపు చిన్న పెద్ద సినిమా ల షూటింగ్ లు మరో వైపు రిలీజ్ కస్టాలు. వాటికి శాశ్యత పరిష్కారం లేదా? ఇది సినిమా రంగంలో వినిపిస్తున్న మాట. అఖండ 2  రిలీజ్ కస్టాలు చూసాక ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు చుట్టుముట్టాయని కొందరు సినీ పెద్దలు చెపుతున్నారు. యాద్రిచకం అయినా, 2005 లో జూనియర్ ఎన్.టి. ఆర్. నటించిన నరసింహుడు కు రిలీజ్ కస్టాలు  మాదిరిగానే బాలకృష్ణ కు అఖండ 2 కు వచ్చాయని అంటున్నారు. అది 2005 లో అయితే, ఇప్పడు 2025 లో కావడం కూడా చిత్రంగా ఉందని తెలియజేస్తున్నారు.
 
నరసింహుడు నిర్మాత చెంగల వెంకట్రావ్  అనుకున్నదానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. అది బి. గోపాల్ దర్శకత్యంలో రూపొందింది. జూనియర్ ఎన్.టి. ఆర్ కు మూడు కోట్ల పారితోషికం ఇచ్చారు. ఇక కెమరా మెన్, ఇతర సాంకేతిక సిబ్బందికీ బాగా అందజేశారు. దానికి తోడు బాలీవుడ్ తారాగణం కావాలని బి. గోపాల్ పట్టుబడితే అధిక మొత్తంతో తెసుకువచ్చారు. ఈ సినిమా కోసం దాదాపు పది కారు లను తీసుకోవాల్చి వచ్చింది. షూటింగ్ లో ఫాన్స్ వస్తే పెద్ద పండగ లా ఉండేది. వచ్చిన వారికి కాదనకుండా మంచి విందు భోజనం ఉండేది. షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ కు కూడా రోజు రాగి ముద్ద, కోడి పులుసు, మేక మాంసం, రొయ్యలు ఇలా ఆర్భాటంగా పెళ్లి విందు లా నిర్మాత ఖర్చు పెట్టారు.
 
దానికి నిర్మాత చెంగల వెంకట్రావ్ వెనుకాడ లేదు. తర్వాత  విదేశాల్లో దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ చేసారు. అనుకున్న దానికంటే వారం రోజులు ఎక్కువ..ఆతర్వాత బడ్జెట్ లో తేడా వచ్చింది. కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోయింది. మరల.. కొందరి  ఫైనాన్సర్స్ తో ఒప్పందాలు పెట్టుకుని సినిమా పూర్తి చేసారు. ఇక విడుదల సమయంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ టైములో డి. సురేష్ బాబు ను నిర్మాత ఆశ్రయించారు. ఆయన కొన్ని చోట్ల తానె పంపిణి  చేసి రిలీజ్ చేసారు. కాని ఫలితంఫెయిల్ కావడంతో నిర్మాత కు అప్పులు ఎక్కువాయి. ఫైనాన్సియర్స్ ఒత్హిడి తట్టుక్లోలేక  హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకారు. ఆ తర్వాత జరిగింది అందరికి తెలిసిందే...
 
ఇక అఖండ 2 కు వస్తే, 14 రీల్స్ నిర్మాతలు గోపి ఆచంట, అనిల్ ఆచంట ఇద్దరు భారిగా ఖర్చు పెట్టారు.  అఖండ తీసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను మాటలు నమ్మి లాబాలు వస్తాయని అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారట. ఇందులో నూ బాలివుడ్ నటినటులను తీస్తుకున్నారు. వారికి భారిగా పారితోషికం అందజేశారు. సల్మాన్ ఖాన్ సినిమాలో నటించిన చిన్న పాప ను కావాలని బోయపాటి తెసుకువచారు. ఆమెకు భారీగా పారితోషికం అందజేశారు. అయితే ముందుగా ఆ పాత్రకు సినియర్ నటి లయ కుమార్తెను తీసుకున్నారు. కొద్ది రోజులు షూటింగ్ చేసాక  అవుట్ పుట్  బాగోలోదని బాలివుడ్ నటిని రంగ్గంలో దింపారు.
 
అదే విదంగా జార్జియా షూటింగ్ కు అనుకున్న దాని కంటే నిర్మాతలు ఎక్కువ ఖర్చు చేసారట. అందుకు బి. గోపాల్ శిషుడు అయిన బోయపాటి లావిష్ గా తీయాలని పట్టుపట్టారట. మరో వైపు వాతావరణం అనుకూలించక ఎక్కువ రోజులు అందరూ అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇలా చాలా సంఘటనలు జరిగాక విడుదలకు మంచి బిజినెస్ అయినా సినిమా రిలీజ్ కాకపోవడం తో లాబాలు కొండెక్కాయి. ఒక వైపు గతం లో తీసిన సినిమా ల తప్పిదాలు, వడ్డికే తీసుకున్న ఫైనాన్స్ వల్ల దాదాపు 100 కోట్ల బరువు వారి నెత్తిపై పడింది. దానితో వారు ఫైనల్గా ఈ సినిమాకూ డి. సురేష్ బాబు పెద్ద మనిషిగా ఈరోస్ వారితో మాట్లాడటం చిత్రంగా సినీ పెద్దలు పేర్కొంటున్నారు. 
 
జూనియర్ ఎన్.టి. ఆర్. చేసిన సినిమాకు నిర్మాత తెలుగుదేశం ఎం. ఎల్. ఎ. అయితే, అఖండ 2 చేసిన హీరో బాలయ్య కూడా తెలుగుదేశం ఎం. ఎల్. ఎ. కావడం విశేషం. ఎదిమైనా బెద్జేట్ విషయం లో టేబుల్ పై క్లారిటీ గా రాసుకోవాలని, వాటిని  నిర్మాతలు చూసుకోవాలని డి. సురేష్ బాబు గట్టిగా చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు