Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమీపుత్ర శాతకర్ణికి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా? దేవదాస్, జోధా అక్బర్‌లకు పనిచేసిన..?

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి రోజుకో కొత్త వార్త వెలువడుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సిన

Advertiesment
Neetu Lulla
, సోమవారం, 18 జులై 2016 (09:40 IST)
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి రోజుకో కొత్త వార్త వెలువడుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే విజువల్ ఎఫెక్ట్‌తో పాటు ప్రేక్షకులు మెచ్చేవిధంగా కనులవిందుగా రూపొందుతాయి.
 
ముఖ్యంగా ఇటువంటి చిత్రాలకు కాస్ట్యూమ్స్ ముఖ్య పాత్రను వహిస్తుంది. ఈ చిత్రం కోసం ఒక ప్రత్యేక డిజైనర్‌ను కూడా ఎంపిక చేశారు. గతంలో ''దేవదాస్'', ''జోథా అక్బర్'' వంటి చిత్రాలకు పనిచేసి, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత నీతూ లుల్లాని ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు డిజైనర్‌గా దర్శకుడు క్రిష్ సెలక్ట్ చేశారు. దాదాపు 300 సినిమాలకు డిజైనర్‌గా పనిచేసిన ఘనత ఈమెకుంది. 
 
''గౌతమీపుత్ర శాతకర్ణి'' సినిమా కోసం నీతూ దర్శకుడు క్రిష్ , కెమెరామెన్ జ్ఞాన‌శేఖ‌ర్, ఆర్ట్ విభాగంతో కలిసి సన్నివేశాలకు తగిన విధంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. శాతావాహనుల కాలానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలపై యూనిట్ సభ్యులు స్టడీ చేస్తున్నారు. 
 
అలాగే భారతదేశంలోని బెస్ట్ జ్యూయెల్ మేకర్స్‌తో ఆభరణాలను తయారుచేయిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య కోసం ప్రత్యేకమైన డిజైన్స్‌ని నీతూ లుల్లా డిజైన్స్ చేశారు. యుద్ధవీరులు వేసుకునే దుస్తులు విషయంలో నీతూ లుల్లా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నయ్య నాలా నటించవద్దన్నరన్న పవన్ : ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌కు పవన్ బర్త్ డే ఫీవర్!