Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నయ్య నాలా నటించవద్దన్నరన్న పవన్ : ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌కు పవన్ బర్త్ డే ఫీవర్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య లండన్‌లో బ్రిటీష్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి మాటె

Advertiesment
Pawan Kalyan Speech @ UKTA Video
, ఆదివారం, 17 జులై 2016 (15:59 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య లండన్‌లో బ్రిటీష్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి మాటెత్తారు. తెలుగు సినీ సీమలో కష్టపడి పైకొచ్చిన నటుల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమాల మీద ఆసక్తి కొద్దీ పైకొచ్చారు. 
 
అలాగే ఒక్కో మెట్టూ పైకెక్కి అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ అయ్యారు. తరువాత మేం ఇండస్ట్రీలోకొచ్చేటపుడు ఆయన సలహాలను అడిగేవాళ్ళమని చెప్పారు. చిరంజీవి తమకు ఇచ్చిన సలహా ఏంటంటే..? విజయానికి దగ్గర దార్లు లేవు, కష్టపడాలి, శ్రమిస్తే ఫలితాలు అవంతట అవే వస్తాయని చెప్పారన్నారు. నటుడికీ తన శైలి ఉండాలని, తనలా నటించొద్దని చెప్పేవారని వెల్లడించారు.
 
ఎన్టీఆర్ హీరోగా సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. కొన్ని అనివార్య కారణాల వలన ఆగస్ట్ 12న విడుదల కానున్న ఈ సినిమా సెప్టెంబర్ 2కు వాయిదా పడింది.
 
అయితే సెప్టెంబర్ 2 అంటేనే ఫ్యాన్స్ జడుసుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న విడుదల అవ్వగా, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న విడుదల అవ్వగా, ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. 
 
మరి సెంటిమెంటల్‌గా ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడుతున్నారట. మరి కొరటాల ఏం చేస్తారో? స్టార్ హీరోల పుట్టిన రోజుల్లో సినిమాలు విడుదల చేయకుండా ఉండటం బెస్ట్ అని సినీ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమ్మూ-చైతూ పెళ్ళి ఉత్తుత్తిదేనా..? హనీమూన్‌కు కొత్త సినిమాలకు లింకు లేదా? సమంత ఇలా చెప్పిందేమిటి?