లేడిఓరియెంటెడ్ సినిమా.. ''అరమ్''లో ఒకే ఒక్క చీరతో పనికాచ్చేస్తున్న నయనతార..?
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార అరమ్ అనే సినిమాలో నటిస్తోంది. జిల్లా కలెక్టర్‌గా ఈ చిత్రంలో నయనతార కనిపించనుంది. యధార్థ ఘటన నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అమ్మడు మేకప్ లేకుండా నటిస్తుందని.. ఒకే చీరతో సినిమా
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార అరమ్ అనే సినిమాలో నటిస్తోంది. జిల్లా కలెక్టర్‌గా ఈ చిత్రంలో నయనతార కనిపించనుంది. యధార్థ ఘటన నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అమ్మడు మేకప్ లేకుండా నటిస్తుందని.. ఒకే చీరతో సినిమా మొత్తం కనిపిస్తుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తన వ్యక్తిగత జీవితంపై ఎన్ని పుకార్లు వచ్చినా.. కెరీర్ పరంగా తన పని తాను చేసుకుంటూ పోతున్న నయనతార చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. ఇందులో లేడీ ఓరియెంటెడ్ సినిమానే అరమ్. ఈ చిత్రం ఒకే రోజు జరిగిన కథగా తెరకెక్కుతుంది.
అందుకు నయనతార ఒకే రోజు కాబట్టి ఒకే రకమైన దుస్తులలో కనిపించనుంది. ఒకే చీరలో సినిమా మొత్తంలో నటించడానికి నయన్ కూడా చెప్పింది. సహజంగా ఇతర హీరోయిన్లు రంగురంగుల కనిపించాలని అనుకుంటారు. కానీ నయనతార నటనకు ప్రాధాన్యమిస్తూ.. ఒకే చీరలో సినిమా మొత్తం కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.