Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫస్ట్‌ లుక్‌.. సెకండ్‌ లుక్‌లతో పోటీపడుతున్న అగ్రహీరోలు... వార్ వన్‌సైడేనా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు షూటింగ్‌లో వున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చిత్రాలు మేకింగ్‌లో వుండడం విశేషం. ఇటీవలే చిరంజీవి.. ఖైదీ నెం.150.. కోసం కొన్ని లుక్స్‌ను వ

Advertiesment
Nandamuri Balakrishna
, శనివారం, 8 అక్టోబరు 2016 (18:27 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు షూటింగ్‌లో వున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చిత్రాలు మేకింగ్‌లో వుండడం విశేషం. ఇటీవలే చిరంజీవి.. ఖైదీ నెం.150.. కోసం కొన్ని లుక్స్‌ను విడుదల చేస్తే.. అంతకుముందే.. బాలయ్య.. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కోసం కొన్ని లుక్స్‌ విడుదల చేశారు. 
 
అయితే శనివారంనాడు ఇద్దరి హీరోలకు సంబంధించి లుక్స్‌ బయటపెట్టారు. రారాజుగా బాలయ్య స్టిల్‌ వస్తే.. చిరంజీవి.. మాత్రం బుల్లితెరపై మీలో కోటీశ్వరు ఎవరు? అంటూ నీట్‌గా సూట్‌బూటు వేసి.. లుక్‌ను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్‌ కోసం బుల్లితెరను వాడుకుంటున్న చిరంజీవి... సంక్రాంతినాడు తన సినిమాను ప్రేక్షకులముందుకు తెస్తున్నారు. 
 
అయితే అదేరోజు బాలయ్య సినిమా విడుదలకానుంది... ఇద్దరు పెద్ద హీరోలకు పోటీనా? అనేది పక్కనపెడితే.. ఎవరు చిత్రం వారిదే అంటూ ఫ్యాన్స్‌ కూడా పాజిటివ్‌గా మాట్లాడుకోవడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బో... విజయ్ దూకుడును తట్టుకోవాలంటే.. మహాశక్తి కావాల్సిందే : కీర్తి సురేష్