Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బో... విజయ్ దూకుడును తట్టుకోవాలంటే.. మహాశక్తి కావాల్సిందే : కీర్తి సురేష్

'నేను శైలజ' సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన మ‌ల‌యాళ‌ భామ కీర్తి సురేష్ వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ భామ హవా కొనసాగుతోంది. 2013లో మళయాల సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్‌

Advertiesment
Keerthy Suresh
, శనివారం, 8 అక్టోబరు 2016 (18:15 IST)
'నేను శైలజ' సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన మ‌ల‌యాళ‌ భామ కీర్తి సురేష్ వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ భామ హవా కొనసాగుతోంది. 2013లో మళయాల సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. 
 
ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌తో కలిసి ఆమె నటించిన 'రెమో' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న భైరవ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. భరతన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా విశేషాలను చెబుతూ విజయ్ హీరోగా నటించనున్న 60వ సినిమాలో ఆఫర్ వచ్చినందుకు ఫుల్ హ్యాపీ అని చెప్పుకొచ్చింది. 
 
ఈ సినిమా గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్ర తనకి ఎంతగానో నచ్చిందని చెప్పింది. తాను అభిమానించే హీరోల్లో విజయ్ ఒకరనీ, ఆయనతో కలిసి నటించడమనేది తన కలని... తన కల ఇంత త్వరగా నెరవేరుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. ఇటీవలే ఆయనతో కలిసి ఒక పాట చిత్రీకరణలో పాల్గొన్నాననీ, డాన్స్‌లో ఆయన స్పీడ్‌ను అందుకోలేక భయపడిపోయానని అంది. తన పరిస్థితిని గమనించి ఆయన ధైర్యం చెబుతూ ప్రోత్సహించాడనీ, ఆయన సహకారం ఎప్పటికి మరిచిపోలేనని చెప్పుకొచ్చిందీ భామ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యావత్ కన్నడ చిత్ర పరిశ్రమను అవమానించింది... సంజనపై చర్య తీసుకోవాల్సిందే!