నాగార్జునకు పనిభారం ఎక్కువైపోయింది. ప్రస్తుతం ఒక్క సినిమా చేయకపోయినా మదినిండా ఆలోచనలే. ఒకవైపు నిఖిల్‌ను గాడిలో పెట్టాలన్న బాధ్యత. మరోవైపు తన కెరీర్ గురించి ఆలోచన. వారసుల కెరీర్ ఒకవైపు తను నటించే సినిమాలు ఇంకోవైపు. నాగార్జున హిందీలో రణభీర్, అలియా భట్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీలో నాగార్జున చేస్తున్నాడు.
200 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. మరోవైపు తమిళంలో ధనుష్‌తో కలిసి ఒక మూవీకి కమిట్ అయ్యాడు. సోగ్గాడే చిన్ని నాయన తరువాత నాగ్ ఇండివిడ్యువల్ సినిమాలు చేయడానికి దాదాపు స్వస్తి చెప్పినట్లు కనబడుతోంది.
మరోవైపు దేవదాస్ సినిమా కూడా అనుకున్నంత హిట్ కాకపోవడంతో నాగ్ బాగా డీలాపడిపోయారు. అందుకే కథ విషయంలోను దర్సకుడి విషయంలోను జాగ్రత్త పడుతున్నారు నాగార్జున. అంతేకాదు సినిమా చేద్దామా వద్దా అన్న ఆలోచనలో కూడా పడిపోయారట. ఆచితూచి అడుగులు వేస్తున్న నాగార్జున సోలో హీరోగా చేయడమా లేదంటే మల్టీస్టారర్ చేయాలా అనేది తేల్చుకోలేకపోతున్నారట. ఐతే ఆధ్యాత్మిక చిత్రాలు చేస్తే ఎలా వుంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అన్నమయ్య లాంటి చిత్రాలు ఏడాదికి ఒక్కటి తీసినా చాలు కదూ...