నేను అందరిలా కాదంటున్న నభా నటేష్..

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (17:41 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణా యాసలో మాట్లాడి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నబా నటేష్. కన్నడ భామ అయినా సరే తెలుగును స్పష్టంగా మాట్లాడుతూ తన డబ్బింగ్ తానే చెప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్‌కు ఎంతమాత్రం తీసిపోలేదన్నట్లు ఆమె నటన అద్భుతమని అభిమానులు మెచ్చుకున్నారు.
 
అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయంతో నబా నటేష్‌కు గర్వం పెరిగిందని సహచర హీరోయిన్ల నుంచి ప్రచారం ప్రారంభమైంది. దీంతో నబా నటేష్ ఆ విషయంపై తీవ్రంగా స్పందించింది. నేను అందరి లాంటి హీరోయిన్‌ను కాదు. నేను ప్రత్యేకం. నేను ఏది అనుకున్నా అది చేయాలనుకుంటాను. తెలుగు నేర్చుకున్నాను. తెలుగులోనే నా డబ్బింగ్ చెప్పాను. 
 
అంతేకాదు పర్యావరణాన్ని కాపాడేందుకు నేను సొంతంగా వినాయకుడిని నా చేత్తో చేశాను. అది కూడా మట్టి వినాయకుడిని అని చెప్పింది. స్వయంగా చేసిన మట్టి వినాయకుడిని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసింది నబా నటేష్. నేను చెబుతున్నాగా ఎవరి విమర్సలు పట్టించుకోను. నా రూటే సపరేట్ అంటోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విజయ్‌ దేవరకొండతో చేద్దామనుకున్నా : శ్రీప‌వార్‌