హీరో మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ దర్శకుడు కాంబినేషన్‌లో తయారైన చిత్రం "బ్రహ్మోత్సవం''. పివిపి బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు. ఈనెల 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో విజయవాడ కుర్రాడిగా కనిపించడానికి మహేష్ బాబు కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవంలో మహేష్‌ని అందంగా డిఫరెంట్ లుక్‌తో చూపించడానికి డైరెక్టర్ కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడట. ఈ సినిమాలో సింపుల్‌గా ఉండే కాస్ట్యూమ్స్ మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దీనికోసం నిర్మాతలు చాలానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నికాస్ట్యూమ్స్ మార్చారో తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే.
అదేమిటంటే… ఈ సినిమా కోసం మహేశ్ దాదాపు 100 కాస్ట్యూమ్స్ మార్చాడట. ఈ విషయాన్ని మహేశ్ స్టైలిష్ట్ అక్షయ్ స్వయంగా వెల్లడించాడు. సాధారణంగా అగ్రహీరో సినిమా అంటే 25 నుండి 30 కాస్ట్యూమ్స్ మార్చితేనే గొప్పగా అనుకోవచ్చు. అలాంటిది ప్రిన్స్ 100 కాస్ట్యూమ్స్ మార్చాడంటే నిర్మాత ఈ సినిమాను ఎంత భారీగా తెరకెక్కించాడో ఇట్టే అర్థమవుతోంది. ఈ కాస్ట్యూమ్స్‌కే సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాస్ట్యూమ్స్ విషయంలోనే ఇంత భారీగా ఆలోచించారంటే సినిమాను ఇంకెంత భారీగా తీర్చిదిద్దారో తెలియాలంటే ఈ నెల 20 వరకు వేచియుండక తప్పదు మరి.