టాలీవుడ్ యువ హీరో తనీష్ తండ్రి వర్థన్ దుర్మరణం చెందారు. ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని చూసిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ వర్థన్ ప్రాణాలు విడిచారు.
విషాదకర సంఘటన మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంటులో జరిగింది. మంగళవారం రాత్రి తమ ఫ్లాట్‌లోని రెయిలింగ్ వద్దకు వచ్చిన ఆయన అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కిందజారి పడిపోయారు. ఆరో అంతస్తు నుంచి కింద పడిన కారణంగా వర్థన్ దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.