Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు పెళ్లైంది.. నా సంసార జీవితాన్ని పాడుచేయొద్దంటున్న బాలీవుడ్ హీరోయిన్?

ఇటీవలికాలంలో బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. పైగా, ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పలువురు బాలీవుడ్ దర్శకులు బయోపిక్‌ను సినిమాలుగా తీసేందుకు ముందుకు వస్తు

Advertiesment
Madhuri Dixit
, బుధవారం, 18 జనవరి 2017 (05:58 IST)
ఇటీవలికాలంలో బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. పైగా, ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పలువురు బాలీవుడ్ దర్శకులు బయోపిక్‌ను సినిమాలుగా తీసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కోవలో మరో బయోపిక్ తెరకెక్కనుంది. ఆ బయోపిక్ కథాశం ఏంటో తెలుసా... బాలీవుడ్ 'ఖల్‌నాయక్' సంజయ్ దత్ బయోపిక్. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో రానున్న ఈ బయోపిక్‌లో సంజయ్‌దత్ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్నారు.
 
1990ల్లో సంజయ్ - మాధురి దీక్షిత్‌ల లవ్ ఎఫైర్ బాలీవుడ్‌లో ఓ హాట్ టాపిక్. 'ఖల్‌నాయక్' సినిమా టైంలోఈ జంటగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన విషయం బహిరంగ రహస్యం. అయితే, ఆ తర్వాత మాధురి దీక్షిత్ పెళ్లి చేసుకొని భర్తతో స్థిరపడిపోయింది. ఇపుడు సంజయ్ దత్ బయోపిక్‌ వెండితెరపై దృశ్యకావ్యంగా రానుంది. దీంతో ఈ అమ్మడుకి ముచ్చెమటలు పోస్తున్నాయి.
webdunia
 
అందుకే.. సంజయ్ దత్ బయోపిక్ చిత్రంలో తమ లవ్ ఎఫైర్‌ను చూపించవద్దని ప్రాధేయపడుతోందట. అలా చేయడం వల్ల తన సంసార జీవితం దెబ్బతినే అవకాశం ఉందని వాపోతుందట. దీంతో సంజయ్ దత్ బయోపిక్‌లో మాధురి దీక్షిత్ లవ్‌ ఎఫైర్‌ని లైట్ తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు సంజయ్ మాధురి దీక్షిత్‌కి హామి ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. మరీ.. మాధురి దీక్షిత్ లేని సంజయ్ బయోపిక్ చిత్రం ఎలాగుంటుందనేది చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకేసారి ఆ ఇద్దరు హీరోలు కలిసి నన్ను కుమ్మేశారు... కాజల్ అగర్వాల్