Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకేసారి ఆ ఇద్దరు హీరోలు కలిసి నన్ను కుమ్మేశారు... థ్రిల్‌గా ఫీలయ్యా : కాజల్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. సుమారు దశాబ్దకాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తూ నిర్మితమైన చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంత

Advertiesment
ఒకేసారి ఆ ఇద్దరు హీరోలు కలిసి నన్ను కుమ్మేశారు... థ్రిల్‌గా ఫీలయ్యా : కాజల్
, బుధవారం, 18 జనవరి 2017 (05:48 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. సుమారు దశాబ్దకాలం తర్వాత చిరంజీవి వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తూ నిర్మితమైన చిత్రం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు.. కాజల్ నటన పాత్రోచితంగా ఉందంటూ ప్రసంశలు వస్తున్నాయి. దీనిపై కాజల్ స్పందిస్తూ... 
 
తన పదేళ్ల ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. ఇన్నేళ్ల పాటు విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు పాత్రలు నచ్చి చేస్తాం. కొన్ని ప్రేక్షకుల కోసం చేస్తాం. కానీ ఈ సినిమాను చిరంజీవి కోసమే చేశాను. గొప్ప నటుడితో తెరను పంచుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పదేళ్ల తర్వాత సినిమాల్లో పునరాగమనం చేసినా నటన పట్ల ఆయనకు ఉన్న తపన, డ్యాన్సుల్లో జోరు ఏదీ తగ్గలేదు. ఇప్పటివరకూ నేను పనిచేసిన హీరోల్లో బెస్ట్ పర్సన్ ఆయనే. 
 
మెగా ఫ్యామిలీలో నేను పనిచేసిన హీరోల్లో ఎవరూ బెస్ట్ అంటే చెప్పడం కష్టమే. కానీ వారందరిలో చిరంజీవి నా అభిమాననటుడు. ఈ సినిమాలో నటన, డ్యాన్సుల పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. ఆయనతో పోటీపడి డ్యాన్సులు చేయడం చాలా కష్టమైంది. పాటల చిత్రీకరణ సమయంలో చాలా టేక్‌లు తీసుకున్నాను. అమ్మడు లెట్స్ కుమ్ముడు పాటలో చిరంజీవి, చరణ్ ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేయడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలింది. నా వరకు అదే నాకు కజ్‌రారే పాట అయింది అని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్యకు 100, గాయని సునీతకు 750... గ్రేట్...