Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ దేవరకొండ ఫ్యాన్సుకు కౌంటరిచ్చిన సమంత!?

Advertiesment
Deverakonda and Samantha
, సోమవారం, 14 ఆగస్టు 2023 (13:08 IST)
''ఖుషి'' మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత పాల్గొనలేదు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై సమంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. " ఈ లోకం కోసం మీరు బతకాల్సిన అవసరం లేదని, మీరు మీ కోసం బతకండని" సామ్ మండిపడింది. 
 
ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోవచ్చని, గౌరవం ఏమిటో తెలుసుకుని, స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలని సమంత హితవు పలికింది. పది మందిలో ఒకరిలా కాకుండా ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో బతికేందుకు ప్రయత్నించండని సమంత కౌంటరిచ్చింది. 
 
అయితే, ఈ కామెంట్స్ ఎవరి గురించి చేసిందో మాత్రం సమంత చెప్పలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఫ్యాన్‌ను ఉద్దేశించే సమంత ఈ వ్యాఖ్యలు చేసిందని టాక్ వస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బయట జరిగిన ఘటనల స్ఫూర్తి తో ప్రేమ్ కుమార్ తీశా : దర్శకుడు అభిషేక్ మహర్షి