జీవీ ప్రకాష్‌తో లవ్‌లో పడనున్న లావణ్య త్రిపాఠి..
అందాల రాక్షసితో తెరంగేట్రం చేసి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా మంచి గుర్తింపు సాధించిన లావణ్య త్రిపాఠి తాజాగా లవ్‌లో ఉన్నట్లు తెలిసింది. రీసెంట్‌గా 'మిస్టర్', 'రాధ' లాంటి ఫ్లాప్స్ ఇచ్చిన లావణ్
అందాల రాక్షసితో తెరంగేట్రం చేసి.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా మంచి గుర్తింపు సాధించిన లావణ్య త్రిపాఠి తాజాగా లవ్‌లో ఉన్నట్లు తెలిసింది. రీసెంట్‌గా 'మిస్టర్', 'రాధ' లాంటి ఫ్లాప్స్ ఇచ్చిన లావణ్య ఓ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో లవ్‌లో పడనున్నట్లు టాక్. అయితే రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లో. సుకుమార్ దర్శకత్వం చేసిన '100% లవ్' తమిళ్‌లో రీమేక్ కానుంది.
నాగచైతన్య , తమన్నా జంటగా వచ్చిన '100% లవ్' తెలుగులో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం సుకుమార్ తన శిష్యుడు చంద్రమౌళి డైరెక్షన్‌లో ఈ రీమేక్ ప్రొడ్యూస్ చేయనున్నాడట. ఈ రీమేక్‌లో నాగచైతన్య రోల్‌లో తమిళ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ కనిపించనున్నాడు. ఇక 'దటీజ్ మహాలక్ష్మి' అంటూ అదరగొట్టిన తమన్నాని కాదని లావణ్యని హీరోయిన్‌గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట.