Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"బూతు'' అనేది లేకుంటే జబర్దస్త్ పడిపోతుంది: మీది లేస్తుంది.. నాది పడుకుంటుంది ప్రోమోతో?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న షేకింగ్ షేషు మాట్లాడుతూ.. నిజానికి ప్రోగ్రామ్‌లు చేసేవాళ్లు బూతు అని కనిపించగానే దాన్నే ప్రోమోగా పెట్టేస్తున్నారన్నారు. దానివల్ల ఆర్టిస్టుల పరువుపోతుందన్నారు. ఇక,

Advertiesment
Shaking Seshu
, ఆదివారం, 4 జూన్ 2017 (15:58 IST)
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్‌‍లో సీనియర్ నటుడు చలపతి రావ్ చేసిన వ్యాఖ్యల పుణ్యమా అని టీవీ ప్రోగ్రామ్‌లపై కూడా వ్యతిరేకత మొదలైంది. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు పదాలతో కామెడీ అంటూ షోలు చేస్తున్న వారిపై కూడా ప్రస్తుతం వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 30 ఇయర్స్ పృథ్వీ చెప్పిన ఒక ప్రోమో మీద విమర్శలు వెల్లువెత్తాయి. దానిపై యాంకర్ అనసూయ కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
 
మరోవైపు అదే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న షేకింగ్ షేషు మాట్లాడుతూ.. నిజానికి ప్రోగ్రామ్‌లు చేసేవాళ్లు బూతు అని కనిపించగానే దాన్నే ప్రోమోగా పెట్టేస్తున్నారన్నారు. దానివల్ల ఆర్టిస్టుల పరువుపోతుందన్నారు. ఇక, "మీది లేస్తుంది.. నాది పడుకుంటుంది" అన్న ప్రోమోపై శేషు వివరణ ఇచ్చాడు. ఆ ప్రోమోలో వచ్చిన మాటలకు అర్థం ప్రోగ్రాం మొత్తం చూస్తే తెలిసిపోతుందన్నారు.
 
ఇంకా '‘జబర్దస్త్' ఫస్ట్ ఎపిసోడ్‌లోనే బీభత్సమైన వల్గారిటీ ఉంది. ఈ ఎపిసోడ్‌ని చూసిన మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఆనందించారు. దీంతో, టీఆర్ పీ 15..16 కు వెళ్లిపోయింది. ఆ ఒరవడి నుంచి వీళ్లు వెనక్కి రాలేకపోతున్నారని షేకింగ్ షేషు అన్నారు. 
 
వల్గారిటీ విషయమై బయట నుంచి ఒత్తిడి రావడంతో.. చివరకు మల్లెమాల సంస్థ వారు కంట్రోల్ చేశారు. దీంతో, టీఆర్పీ 8..9 కి పడిపోయింది. ఇందుకు కారణం  బూతు అనేది లేకుంటే టీఆర్పీ రేటింగ్ పడిపోతుందని శేషు వివరణ ఇచ్చారు. ప్రోగ్రామ్‌లు బాగోలేకపోవడం అనేది ఛానళ్ల తప్పు కాదు.. ప్రేక్షకుల తప్పు అని శేషు చెప్పుకొచ్చాడు. తద్వారా చెడు అనేదే ఎక్కువ మందికి.. త్వరితగతిన రీచ్ అవుతుందనే విషయాన్ని షేకింగ్ షేషు గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట..