Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయ్ లక్ష్మీ కిస్ సీన్ సరిగ్గా చేయకపోతే.. డైరక్టర్ లిప్ లాక్ ఇచ్చి.. ఎలా చేయాలో?!

Advertiesment
lakshmi rai
, మంగళవారం, 7 జూన్ 2016 (11:43 IST)
'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ తన అందాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ భామ ఆ తరువాత బాలీవుడ్‌కి మకాం మార్చింది. గతంలో వచ్చిన సెక్సీ మూవీ 'జూలీ' సీక్వెల్‌లో రాయ్ లక్ష్మీ నటిస్తుంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా చేసిన నేహాధూపియా ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది.
 
కాగా అదే సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ''జూలీ 2''లో రాయ్ లక్ష్మీ కూడా నేహాధూపియాకి ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయి నటిస్తోందట. ఒక బెడ్ రూమ్ సీన్‌లో అయితే అమ్మడు హీరోతో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో అమ్మడు హాట్ సీన్స్‌లో సెగలు పుట్టించడం ఖాయమని సినీవర్గాలు అంటున్నాయి.
 
అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలోని ఒక ముద్దు సన్నివేశంలో రాయ్ లక్ష్మీ సరిగ్గా చెయ్యలేదని ఈ చిత్ర డైరెక్టర్ దీపక్ తానే స్వయంగా రాయ్ లక్ష్మీకి లిప్ లాక్ ఇచ్చి ఇలా చెయ్యాలని చూపించాడట. దీంతో రాయ్ లక్ష్మీ హీరో కంటే డైరెక్టర్‌తోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటుందట. షూటింగ్ అయ్యాక కూడా ఈ జంట తెగ ముచ్చట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు అంటున్నారు. మొత్తం మీద రాయ్ లక్ష్మీ ఈ చిత్రంతో బాలీవుడ్‌లో సెటిల్ అవ్వడం ఖాయమని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎడమొహం-పెడమొహంగా జాన్ అబ్రహాం- ప్రియా రుంచల్.. కలిసుంటారా? విడిపోతారా?