బాలీవుడ్‌లో ఇంకో జంట తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆ జంట ఎవరో కాదు నటుడు జాన్ అబ్రహం, భార్య ప్రియా రుంచల్. బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషాతో మనస్పర్థల కారణంగా విడిపోయాక ప్రియా రుంచల్‌ను రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని తన వైవాహిక జీవితాన్నిప్రారంభించాడు జాన్. ఏం జరిగిందో ఏమో తెలియదు హాయిగా జీవితం గడుపుతున్నఈ జంట విడిపోతున్నట్లు జాన్ సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరి ఎలాంటి గొడవలు లేవని అలాని ఇద్దరూ సంతోషంగా కూడా లేరని వారంటున్నారు.
వృత్తి రీత్యా ఇద్దరూ వేర్వేరు దేశంలో ఉండడంవల్ల ఇద్దరి మధ్య చనువు లేదని, పెళ్లయ్యాక వీరిద్దరూ కలిసి ఉన్న సందర్భాలు చాలా తక్కువని తెలిపారు. ఇద్దరూ దూరంగా ఉండడం వల్ల చాలా అరుదుగా కలుసుకునేవారట. ఒకపక్క జాన్ షూటింగ్‌లో బిజీగా గడపడం, మరోపక్క ప్రియా అమెరికాలో ఉద్యోగం చేయడంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగే అవకాశాలు చాలా తక్కువ. దీంతో ఇద్దరి మధ్య స్థలాల దూరంతో పాటు మానసికంగా కూడా ఎడబాటు పెరిగిపోయింది. దీంతో ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే ఉంటున్నారని సన్నిహితులు వాపోతున్నారు. ఈ జంట విడిపోతుందా.. లేదా మాట్లాడుకుని తమ సమస్యను పరిష్కరించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.