ఆ హీరోయిన్ అదృష్టం రవితేజకు కలిసొస్తుందా..? (Video)

సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (21:56 IST)
సంవత్సరానికి మూడు సినిమాలు. మాస్ మహరాజ్ రవితేజ తీసే సినిమాలవి. ఒకప్పుడు రవితేజ నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్లే. ఈ జోష్‌తో ఆయన తన సినిమాల సంఖ్యను బాగానే పెంచాడు. అయితే రానురాను కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం నిరుత్సాహం కలగడంతో సంవత్సరానికి రెండు సినిమాలను పరిమితం చేశాడు.
 
కానీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తే హీరోయిన్‌ను కూడా ఆచితూచి ఎంచుకుంటున్నారట రవితేజ. తనకు బాగా కథ నచ్చితేనే అది కూడా. అలాగే డైరెక్టర్ కూడా. ఇలా రవితేజ ఒక్కొక్కటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. 
 
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్సకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నారట రవితేజ. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతోంది. అయితే ఆ సినిమా పూర్తయిన తరువాత దర్శకుడు రమేష్ వర్మ చెప్పిన కథ బాగా నచ్చేసిందట రవితేజకు. అందుకే ఆ సినిమా షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొందామా అనే ఆతృతలో ఉన్నారట రవితేజ.
అయితే ఆయన దురదృష్టమేమోగానీ రవితేజకు జోడీగా ఎంచుకున్న కైరా అద్వానీ మాత్రం బాలీవుడ్ సినిమాలతో బాగా బిజీగా ఉంటోందట. దీంతో తాను రవితేజతో కలిసి నటించడానికి ఏప్రిల్, మే నెల అవుతుందని చెప్పేసిందట. అయితే రవితేజ మాత్రం త్వరగా సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాడట. 
 
కైరా అటు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను దక్కించుకుంటోంది. దీంతో ఆమె అదృష్టమన్నా కలిసి వస్తుందేమోనన్న నమ్మకంతో ఉన్నారట రవితేజ. మరి చూడాలి.. వీరిద్దరి మధ్య కాంబినేషన్లో సినిమా తెరకెక్కి ఆ సినిమా హిట్ అవుతుందో లేదో.  
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సూపర్ స్టార్ కౌగిలిలో వాలిపోయిన హీరోయిన్