Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేజీఎఫ్‌ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ టాలీవుడ్ స్టార్‌తో, ఎవరా స్టార్?

Advertiesment
కేజీఎఫ్‌ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ టాలీవుడ్ స్టార్‌తో, ఎవరా స్టార్?
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (18:48 IST)
కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్‌. విభిన్న కథాంశంతో రూపొందిన కేజీఎఫ్‌ సంచలన విజయం సాధించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీలో కూడా సక్సస్ కావడం విశేషం. దీంతో కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే.. కేజీఎఫ్ ఇచ్చిన సక్సస్‌తో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. 
 
కేజీఎఫ్ 2 మూవీ రానుందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దసరాకి ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్లో స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ముగ్గురిలో ప్రశాంత్ నీల్ ఎవరితో ముందుగా సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబుతో  కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఖరారు అయ్యింది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని కూడా టాక్ వినిపించింది కానీ.. ప్రస్తుతం మహేష్ పరశురామ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబుతో చిత్రం చేయబోతున్నట్లు చెప్పారు.
 
అందుచేత ప్రశాంత్ నీల్‌తో మహేష్ సినిమా ఇప్పట్లో లేనట్టే అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్నారు. అందుచేత ఎన్టీఆర్‌తో కూడా ప్రశాంత్ నీల్ చేయాలనుకున్న సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. తాజాగా ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉంది. 
 
అయితే.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో చేస్తున్నాడు. అందుచేత ప్రభాస్‌తో సినిమా ఓకే అయినా సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పడుతుంది. అయితే.. ఈ ముగ్గురిలో ఎవరితో చేయనున్నాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీ దూకుడు తట్టుకునేందుకు ఇంట్లో వర్కౌట్ల్ చేస్తున్న రష్మిక