కీర్తి సురేష్ మూవీ 'బేబిజాన్' డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ కాలీస్ దీన్ని తెరకెక్కించాడు. వామికా గబ్బీ, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కీర్తికి డ్రీమ్ డెబ్యూ కాలేకపోయింది.
ప్రస్తుతం కీర్తి చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి సెట్స్‌పై ఉన్న సినిమాలు తప్ప కొత్త సినిమాలు యాక్సెప్ట్ చేయడం లేదట. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి సంసార జీవితానికే పరిమతమవాలని ఆమె భావిస్తోందట. దీంతో కీర్తి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇటీవల డిసెంబర్ 12న కీర్తి తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రలు మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లయిన తర్వాత వెంటనే తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ప్రమోషన్స్‌లో పాల్గొంది.