పెళ్లి తర్వాత కీర్తి సురేష్ తొలి పబ్లిక్ అప్పియరెన్స్ అదిరిపోయింది. తాను నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఈవెంట్‌కు వచ్చింది. రెడ్ బాడీకాన్ డ్రెస్‌లో పెళ్లి కళ ఉట్టిపడుతుండగా.. కీర్తి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ డిసెంబర్ 12న గోవాలో తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట హిందూ సాంప్రదాయంలో, ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో వీళ్ల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కీర్తి సురేష్ మెడలో తాళితో కనిపించడం విశేషం.
అయితే పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన కీర్తి సురేష్ మెడలో తాళితో కనిపించడం విశేషం. నిజానికి కీర్తి చాలా హాట్ గా, స్లిమ్ గా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.