Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరీనా తల్లి కాబోతుందోచ్...

Advertiesment
Kareena Kapoor
, శుక్రవారం, 3 జూన్ 2016 (08:44 IST)
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తల్లి కాబోతుందోచ్. ఈ ముద్దుగుమ్మ 2012లో సైఫ్ అలీఖాన్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. కాగా బాలీవుడ్‌లో ఇప్పుడు ఓ శుభవార్త మారుమోగిపోతోంది. ఇటీవలే కరీనా, సైఫ్‌లు సెలవులను ఎంజాయ్ చేయడానికి లండన్ వెళ్లి బుధవారం ఇండియాకు చేరుకున్నారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు ఆ జంటను చుట్టుముట్టారు.

కొన్ని ఫోటోలలో కరీనా బుజ్జిపొట్ట లావుగా కనిపించడంతో కరీనా తల్లికాబోతోందని ఇప్పుడు బెబో మూడున్నర నెలల గర్భవతి అని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ విషయంపై సైఫ్ దంపతులు ఇప్పటివరకు స్పందించలేదు. కరీనా ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎంజాయ్ చేసేందుకు కరీనా, అల్లుడు సైఫ్‌లు లండన్‌‌కు వెళ్లి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై కరీనా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమందా హోల్డెన్‌కు ఫ్యాన్స్ షాక్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫేక్ అంటూ..?