Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కథలో లోపం వున్నా కల్కి సక్సెస్ - భారతీయుడు 2 ఎందుకు కాలేదు?

Advertiesment
Kalki- bharatiyudu 2

డీవీ

, శనివారం, 13 జులై 2024 (16:34 IST)
Kalki- bharatiyudu 2
ఇప్పుడు చలన చిత్రరంగంలో రెండు సినిమాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో విడుదలైన భారతీయుడు 2 ఫెయిల్ అయిందని టాక్ వినిపిస్తోంది. అందుకు రకరకాల కారణాలు పలు విశ్లేషకులు చేస్తున్నారు. శంకర్ ఇంకా 1998 ఫార్మెట్ లో వుండి అప్పటి అవినీతిపైనే 2024 లోనూ టచ్ చేశాడు. కథలో పెద్దగా కొత్తదనం లేదు. భారతీయుడు సీక్వెల్స్ లో తైపీ నుంచి ఇండియా వచ్చి కమల్ అవినీతి పరులకు విధించిన శిక్షలులో పెద్దగా క్లారిటీ లేదు. సినిమా మూడు గంటలను కుదించి రెండు గంటల్లో కథను చెబితే మరింత బాగుండేది అని సినీప్రముఖులు పేర్కొంటున్నారు.
 
భారతీయుడు సినిమాను మరోసారి చూసినట్లు వుంది మినహా కొత్తగా ఏమీలేదు. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాటిక్ గా వున్నాయి. అవినీతిని ఇప్పటి యూత్ మీ ఇంటినుంచే గాంధీగారి మార్గంలో  వెలికితీయండి అనే కొత్త పాయింట్ ను శంకర్ చెప్పారని అందుకు ఆయన్ను అభినందిస్తున్నట్లు తెలియజేస్తున్నారు విశ్లేష్లేకులు.
 
కాగా, కొద్దిరోజులు ముందు విడుదలైన ప్రభాస్ కల్కి కూడా ఇంచుమించు అలాంటిదే అన్నట్లు వుంది. కల్కి మొత్తం సినిమా పాత్రలను పరిచయం చేయడంతోనే సరిపోయింది. అందులో సరైన కథే లేదు. కర్ణుడు, అర్జునుడు, క్రిష్ణుడు పాత్రలను పెట్టి పురాణాన్ని కల్పితంగా తీసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో లక్క్ తో బయటపడ్డాడు అని పలువురు విశదీకరిస్తున్నారు. ఆ లక్ అనేది లేక భారతీయుడు సీక్వెల్ బయటపడలేకపోయింది అని టాక్ సర్వత్రా నెలకొంది. అందుకే భారతీయుడు ౩ పార్ట్ లో అసలు కథ మొత్తం తెలుస్తుందని ప్రీరిలీజ్ లో శంకర్ అన్నాడని సమాచారం. మరి ఈసారైనా మెప్పిస్తాడో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ తరుణ్‌కు ఇతర నటీమణులతో సంబంధం.. ఆత్మహత్య చేసుకుంటా.. లావణ్య