చిరంజీవితో మరోమారు కుమ్మించుకోవాలి... ఇంకా బోలెడన్నీ చేయాలి.. కాజల్ కోర్కెల చిట్టా...
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం నటించిన చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బంపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. దీ
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం నటించిన చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బంపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. దీంతో ఈ అమ్మడు ఫుల్‌జోష్ మీద ఉంది. ఫస్ట్ టైం మెగాస్టార్‌తో హిట్ కొట్టడంతో తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయని కాజల్ పూర్తి నమ్మకంతో వుంది. ఈ సక్సెస్‌తో కాజల్‌లో కొత్త కోరికలు మొదలయ్యాయట.
అవేంటంటే.. చిరంజీవితో మరోమారు నటించాలని ఉందట. అలాగే, నెగటివ్ రోల్ చేయడం తన డ్రీమ్ అంటోంది. నెగటివ్ రోల్‌లో కూడా తన టాలెంట్ ఏంటో చూపిస్తానంటోంది. కాజల్ విలన్‌గా చేయడం తన డ్రీమ్ అని చెప్పడంతో ఈ అమ్మడి అభిమానులు షాక్ అయ్యారు. ఇన్నోసెంట్‌గా కనిపించే కాజల్‌లో ఇలాంటి యాంగిల్ కూడా వుందా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కాజల్‌కి నెగటివ్ క్యారెక్టర్ ఇచ్చే రిస్క్ ఎవరు చేస్తారనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న.