హృతిక్ చేతుల్లో నలిగాకే నాలో బెస్ట్ ఔట్‌పుట్ బయటకొచ్చింది... యామీ గౌతమ్
యామీ గౌతమ్. ప్రముఖ ముఖ సౌందర్య సాధన ఉత్పత్తి అయిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ. 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి బిజీ అయిపోయింది. ప్రముఖ దర
యామీ గౌతమ్. ప్రముఖ ముఖ సౌందర్య సాధన ఉత్పత్తి అయిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ. 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి బిజీ అయిపోయింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'సర్కార్ 3', హృతిక్ రోషన్ 'కాబిల్'లాంటి అతిపెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
వాస్తవానికి బాలీవుడ్‌లో ఇప్పటివరకూ చిన్న హీరోల సినిమాలు చేసిన యామీకి 'కాబిల్'లో టాప్ హీరో హృతిక్ ఆఫర్ ఇవ్వడంతో ఈ హీరోని తెగ పొగిడేస్తోంది. హృతిక్ అమేజింగ్ యాక్టర్.. అమేజింగ్ డాన్సర్.. అతనితో వర్క్ చేసి చాలా నేర్చుకున్నానంటోంది.
ముఖ్యంగా.. అతని చేతుల్లో నలిగిన తర్వాతే తనలోని బెస్ట్ టాలెంట్ బయటకు వచ్చిందని చెపుతోంది. ఎందుకంటే.. హృతిక్ తన పెర్ఫార్మెన్స్‌తో పాటు కో-యాక్టర్ నుంచి కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చేలా వ్యక్తిగత కేర్ తీసుకుంటాడని చెపుతోంది.
అందుకే 'నేను బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేయగలిగాను' అంటోంది. హృతిక్ - యామీ జంటగా నటించిన ఈ మూవీ తెలుగులో 'బలం' పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో హృతిక్ - యామీ ఇద్దరూ ఈ మూవీలో అంధులుగా నటించారు.