Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోహిత్, నాగ‌శౌర్య‌ల జో అచ్యుతానంద‌..

''సుబ్రమణ్యం ఫర్ సేల్'' చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ రెజీనా ప్రస్తుతం తెలుగులో ''జో అచ్యుతానంద'' అనే సినిమాలో నటిస్తుంది. ట్రైయాంగిల్ ల‌వ్‌స్టోరీతో సాగుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌, నాగ

Advertiesment
Jyo Achyutananda Teaser - Nara Rohith
, గురువారం, 18 ఆగస్టు 2016 (14:21 IST)
''సుబ్రమణ్యం ఫర్ సేల్'' చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ రెజీనా ప్రస్తుతం తెలుగులో ''జో అచ్యుతానంద'' అనే సినిమాలో నటిస్తుంది. ట్రైయాంగిల్ ల‌వ్‌స్టోరీతో సాగుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌, నాగ‌శౌర్యలు హీరోలుగా నటిస్తున్నారు. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
వారాహి చలన చిత్రం పతాకంపై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఒక అమ్మాయిని వెంట‌ప‌డుతూ.. ఇబ్బందిపెట్టే విధంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో నారా రోహిత్‌, శౌర్య అన్నద‌మ్ములుగా న‌టిస్తున్నారు.
 
 జ్యో (రెజీనా)ను త‌న ప్రేమకు బానిస చేసుకుంటామ‌ని ఈ ఇద్దరు హీరోలు స‌వాల్ విసురుకుంటారు. తాజాగా రిలీజైన జో అచ్యుతానంద మూవీ టీజర్ గురించి నిర్మాత మాట్లాడుతూ...ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య నడిచిన అందమైన ప్రేమ కథ ఇది. అనవసరమైన ఫైట్లూ, గందరగోళం లేకుండా ఈ మూవీకి ఆహ్లాదకరమైన టైటిల్ పెట్టామని సాయి కొర్రపాటి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాల్‌పై నిర్మాతల మండలి ఫైర్.. బోండాలు, బజ్జీలు తెప్పించుకుని తింటూ..?