Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపూ అవుట్.. ఏడుస్తున్న ముమైత్.. బిగ్ బాస్ హౌస్‌కు గుత్తా జ్వాల?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోతో సదరు టీవీకి రేటింగ్స్ పెరిగిపోతోంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో వీక్ డేస్‌లో పార్టిసిపెంట్లు చేసే ఓవరాక్షన్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపట

Advertiesment
సంపూ అవుట్.. ఏడుస్తున్న ముమైత్.. బిగ్ బాస్ హౌస్‌కు గుత్తా జ్వాల?
, శుక్రవారం, 28 జులై 2017 (12:26 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోతో సదరు టీవీకి రేటింగ్స్ పెరిగిపోతోంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో వీక్ డేస్‌లో పార్టిసిపెంట్లు చేసే ఓవరాక్షన్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపట్లేదు. అందుకే బిగ్ బాస్ షోకు మరింత క్రేజ్ సంపాదించిపెట్టాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త పార్టిసిపెంట్ల‌ను బిగ్‌బాస్ ఇంట్లోకి పంపేందుకు యోచిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను కలిసినట్లు సమాచారం. ఇదివ‌ర‌కు కూడా షోలో కొత్త‌ద‌నం కోసం యాంక‌ర్ అన‌సూయ‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. వాటిలో నిజం లేద‌ని స్వ‌యంగా అన‌సూయే వెల్ల‌డించిన సంగతి తెలిసిందే. 
 
దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు రూటు మార్చారు. క్రీడారంగంలో గ్లామర్ ప్లస్ ఆటతో ఆకట్టుకుని వివాదాలకు పక్కనే వుండే గుత్తా జ్వాలను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సంపూ అర్థంత‌రంగా వెళ్లిపోవ‌డంతో బిగ్‌బాస్ షోకు ఈ వారం నుంచి రేటింగ్స్ త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 
 
అలాగే పార్టిసిపెంట్ల‌లో ఇప్ప‌టికే మ‌ధుప్రియ‌, ముమైత్‌, క‌ల్ప‌న‌లు ఇంటి మీద బెంగ‌తో ఏడ్వ‌డం చూస్తూనే ఉన్నాం. వీళ్ల‌ని వీలైనంత త్వ‌ర‌గా ఇళ్ల‌కు పంపి కొత్త వాళ్ల‌ను దింపే ప్ర‌య‌త్నంలో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుత్తా జ్వాలను రంగంలోకి దించి.. కొత్తవారిని కూడా ఎంపిక చేసే పనులో నిర్వాహకులు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైసా వసూల్ టీజర్: తమ్ముడూ.. నేను జంగిల్ బుక్ సినిమా చూడలేదు.. బాలయ్య డైలాగ్స్ అదుర్స్ (Video)