Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుధీర్‌, ర‌ష్మిల పెళ్లి గోల వారికి వ్యాపారంగా మారిందా! (video)

సుధీర్‌, ర‌ష్మిల పెళ్లి గోల వారికి  వ్యాపారంగా మారిందా! (video)
, శుక్రవారం, 29 జనవరి 2021 (07:59 IST)
Rashmi gowtham, Sudheer marriage
యాంక‌ర్‌, న‌టులు అయిన సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ల పెళ్లి వార్త మ‌ర‌లా టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో వీరిద్ద‌రు వున్న షోలో ఏదోర‌కంగా ఒక‌రిపై ఒక‌రిపై సెటైర్లు వేసుకోవ‌డం, కావాల‌ని మ‌రొక‌రు వీరిద్ద‌రిపై సెటైర్లు వేయ‌డం మామూలుగా జ‌రిగిపోతుంది. వీరి క్రేజ్ చూసే ప్రేక్ష‌కుల‌కు చాలా స‌ర‌దాగా, కాలక్షేపంగా వుంటోంది. దీనిని క‌నిపెట్టిన ఛాన‌ల్ వారు ఒక‌సారి వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటే ఎలా వుంటుంద‌నే కాన్సెప్ట్‌తో షో చేశారు. అది గొప్ప ట్రెండ్ అయింది. అలాంటి మ‌రోసారి చేయాల‌ని షో నిర్వాహ‌కులు చూస్తున్నారు. ఆ షోలో జ‌డ్జి రోజా వీరిద్ద‌రి పెళ్లి ప్ర‌స్తావ‌న తేవ‌డ‌మేకాకుండా ఇంకా వుంటే ముస‌లివాళ్ళు అయిపోతారు. అప్పుడు మీ ష‌ష్టిపూర్తి చేయాల్సివ‌స్తుంద‌ని సెటైర్ వేసింది. అందుకే మీరు త్వ‌ర‌గా పెళ్లి చేసుకోండి. మేం వ‌చ్చేందుకు రెడీగా వున్నామ‌ని చెప్పారు. దీంతో సుధీర్‌ పక్కనే ఉన్న రష్మి వైపు చూసి చిరునవ్వులు చిందించాడు. అనంతరం రోజా.. రష్మిని సైతం ఇదే ప్రశ్న వేయగా.. ఆమె కూడా సుధీర్‌ వైపు చూసి సిగ్గుపడింది. వెంటనే ఇంకా టైమ్ ఉంద‌ని సుధీర్ బదులు ఇచ్చాడు. దీనితో ఒక్కసారిగా ఆ షో ప్రోమో వైరల్ అయి ఇప్పుడు నెట్టింట ట్రేండింగ్ అవుతుంది.

ఈ విష‌యంలో అవ‌స‌ర‌మైతే కొత్త‌గా స్కిట్‌ను రాసుకునే ప్ర‌య‌త్నంలో వున్నార‌ట‌. ఇప్ప‌టికే ఇరువురు ఇంటిలో పెద్ద‌గా అభ్యంత‌రం చెప్ప‌క‌పోయినా పెళ్లి చేసుకున్నాక ఇరువురూ షోలో పాల్గొంటే షోకు కిక్ వుండ‌ద‌నీ, వారు పాత‌ప‌డిపోతార‌ని ఓ టీవీ షో నిర్వాహ‌కులు వారి ముందు వ్య‌క్తం చేసిన‌ట్లు తాజా స‌మాచారం. అందుకే వారు పెళ్లిని వాయిదా వేస్తు వ‌స్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఓ ప్ర‌ముఖుడు అన్న‌ట్లు సెల‌బ్రిటీస్ పెళ్లికూడా పెట్టుబ‌డిదారుల వ్యాపార‌మే అనేది నిజ‌మేనా! అనిపిస్తుంది. ఏం జ‌రుగుతుందో చూద్దాం.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిధి అగర్వాల్‌కు లక్కీ ఛాన్స్... ఏంటది?