సినిమా తీయడానికి కెమెరా వుంటే చాలదు. దాన్ని సరిగ్గా తీసే కెమెరామెన్ కావాలి. దర్శకుడు దిశానిర్దేశం చేయాలి. హీరో అందుకు అంగీకరించాలి. చాలా సందర్భాల్లో తీసిన ఫుటేజ్ ను ఎక్కువగా తీసి ఆ తర్వాత అంతా చుట్టు చుట్టేవారు. రానురాను దానిని వర్కింగ్ షాట్స్ గా సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ చేసేవారు. మారిన టెక్నాలజీ రీత్యా నిడివి ఎక్కువైతే రెండో భాగంగా మార్చి దానికి కొన్ని హంగులు దిద్దడం అలవాటయింది. చెప్పినదానికి తీసినదానికి చాలా వ్యత్యాసం వుండేలా రాజమౌళి చేస్తుంటాడని నిర్మాతలు చెబుతుంటారు. కానీ దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆయనకే తెలుసు.
ఇక అసలు విషయానికి వస్తే పాన్ ఇండియాగా యశ్ హీరోగా చేస్తున్న సినిమాను నెలపాటు షూటింగ్ చేసినట్లు తెలిసింది. దానికి కోట్ల రూపాయలఖర్చు కూడా అవుతుందనే తెలిసిందే. అయితే తీసిన ఫుటేజ్ చూశాక హీరోకు నచ్చక మొత్తం డిలీట్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఆయన హీరోగా టాక్సిక్ సినిమా రూపొందింది. గీతూ మోహన్ దాస్ చెప్పిన కథనచ్చి ముంబైలో నెల రోజుల పాటు ఓ షెడ్యూల్ నిర్వహించారు. తీరా.. ఫుటేజీ చూసుకొంటే హీరోగారికి నచ్చలేదట. మరి ధానిని తీసేయడం ఓకే. మరోలా ఉపయోగించుకోవచ్చనే ఆలోచన దర్శకుడు చెప్పడం కూడా జరిగిందట. మరి ఆ ఫుటేజ్ వుంటుందో లేదో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. సహజంగా ప్రమోషన్ లో మాత్రం వేస్టేజ్ ఏమీ జరగలదేని చెప్పడం మామూలే. ఈసారి ఏమి చెబుతారో చూడాలి.