ఏమాయ చేశావె సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం ఆపై ప్రేమగా.. తర్వాత పెళ్లిగా మారింది. కానీ సమంత-చైతూ జంట విడాకులతో విడిపోయింది. రెండేళ్ల తర్వాత, డిసెంబర్ 2024లో, నాగ చైతన్య నటి శోభితను వివాహం చేసుకున్నాడు. ఇంతలో, సమంత తన ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సమంత చైతూ జ్ఞాపకాలను చెరిపేసేందుకు సిద్ధం అయ్యింది. చేతిపై వేసుకున్న చైతూ టాటానూ సమంత తొలగించుకునే పనిలో ఉందని తెలుస్తోంది. అయితే, శాశ్వత టాటూను తొలగించడం అంత తేలికైన పని కాదు. ఆమె ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇది చాలా సమయం తీసుకుంటుంది. ఆదివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు అభిమానులు ఆమె టాటూ క్రమంగా మసకబారుతున్నట్లు గమనించారు. దీంతో చైతూ టాటూ త్వరలో సమంత చేతి నుంచి తొలగిపోతుందని వారు అంటున్నారు.