Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్ కొత్త కుంపటి? మూకుమ్మ‌డి రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డారా?

Advertiesment
ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్ కొత్త కుంపటి? మూకుమ్మ‌డి రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డారా?
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:09 IST)
Prajash raj pannel
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌కాష్‌రాజ్ నిన్న‌నే మీడియా ముందుకు వ‌చ్చి రాజీమానా చేశాడు. ఇది ఆరంభమే ఇంకా అస‌లు విష‌యం ముందుంద‌ని చెప్పాడు. ఇక జ‌రిగిన రోజు ప్ర‌కాష్ రాజ్ పేన‌ల్‌లోని అన‌సూయ ముందురోజు గెలిచింది అని ప్ర‌క‌టించారు ఎలక్ష‌న్ అధికారులు.

కానీ ప్ర‌కాష్‌రాజ్ రాజీనామా ప్ర‌క‌టించిన రోజే పేన‌ల్‌లోని కార్య‌వ‌ర్గ స‌భ్యుల కౌంటింగ్ జ‌రిగింది. కౌంటింగ్ అనంత‌రం అన‌సూయ ఓడిపోయింద‌ని ఎల‌క్ష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. దీనిపై అన‌సూయ మాట్లాడుతూ, బేల‌ట్‌బాక్స్‌లో ఇంటికి తీసుకెళ్ళార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది.

 
కాగా, మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌కాష్‌రాజ్ అక‌స్మాత్తుగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాడు. వివ‌రాలు పి.ఆర్‌.కూడా చెప్ప‌కుండా ప్రెస్‌ను పిల‌వండ‌ని సినిమాటిక్‌గా చెప్పేశాడు. బ‌హుశా, అన‌సూయ విష‌యంతోపాటుగా ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్ స‌భ్యులంద‌రూ మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేయ‌నున్నార‌ని టాక్ నెల‌కొంది. ఇప్ప‌టికే నాగ‌బాబు, ప్ర‌కాష్‌రాజ్ రాజీనామాలు చేసేశారు. త‌మ పేన‌ల్ అధ్య‌క్షుడే రాజీనామా చేస్తే మిగిలిన‌వారు ఇంకా వేలాడ‌డం బాగోద‌ని ఎవ‌రో స‌ల‌హా ఇవ్వ‌డంతో ఇలా చేస్తున్నార‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

 
ఇప్ప‌టికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ రెండు ముక్క‌లుగా విడిపోతుంద‌ని క‌థ‌నాలు కూడా వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే ఆయా వ్య‌క్తుల సినిమాల‌పై ఆ ప్ర‌భావం త‌ప్ప‌కుండా వుంటుంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత నా సోదరి, ఐల‌వ్‌యూ అన‌కూడ‌దా? నాకు ప్రాణ హాని వుంది