బాయ్‌ఫ్రెండ్ నీబోన్‌తో ఇలియానా లిప్ లాక్.. రొమాన్స్ పక్కా.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటా? (Video)
పోకిరి వంటి సినిమా ద్వారా గుర్తింపు సంపాదించి.. బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఇలియానా ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవలే స్విమ్మింగ్ పూల్‌లో హాట్ హాట్ అందాలతో కనిపించిన
పోకిరి వంటి సినిమా ద్వారా గుర్తింపు సంపాదించి.. బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఇలియానా ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇటీవలే స్విమ్మింగ్ పూల్‌లో హాట్ హాట్ అందాలతో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ ఆస్ట్రేలియా అందగాడు ఆండ్రూ నీబోన్‌తో లిప్ లాక్ హాట్ హాట్‌గా కనిపించిన ఫోటోలతో కూడిన వీడియోను విడుదల చేసింది.
స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో అందాలను ఆరబోసిన వేడి ఇంకా తగ్గని తరుణంలో బాయ్‌ఫ్రెండ్‌తో లిప్ లాక్ చేస్తూ అమ్మడు విడుదల చేసిన వీడియోకు హిట్స్ దుమ్మురేపుతున్నాయి. బాలీవుడ్‌లో ఆశించినంత అవకాశాలు రాకపోవడంతో ఇలియానా తన పర్సనల్ లైఫ్‌పై శ్రద్ధ పెట్టింది.
ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్.. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్. ఇతనితో ఇలియానా సహజీవనం చేస్తుందని వార్తలొచ్చాయి. ఇతనినే ఆమె పెళ్లాడనుందని కూడా గాసిప్స్ వినిపించాయి. ఇవన్నీ నిజమేనని త్వరలో ఇలియానా పెళ్ళి కూతురు కానుందని ఈ వీడియో ద్వారా నొక్కి చెప్పేసింది.
చివర్లో లిప్ లాక్‌తో తాము త్వరలో ఒకటి కానున్నామని.. ఈ వీడియోలో బాయ్‌ఫ్రెండ్‌తో చక్కని రొమాన్స్ పండించింది. ఇంకేముంది.. ఈ వీడియోను ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని ఫిక్సైపోతే పోలే...