Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'చిత్రాంగద'గా వస్తున్న అంజలి.. ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయింది!

కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో "చిత్రాంగద" పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల

Advertiesment
'చిత్రాంగద'గా వస్తున్న అంజలి.. ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయింది!
, మంగళవారం, 15 నవంబరు 2016 (17:47 IST)
కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో "చిత్రాంగద" పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించి, ప్రస్తుతం ప్రముఖ కథానాయిక అనుష్కతో భాగమతి వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్న వెర్సటైల్ దర్శకుడు అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్త హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌కాపీని చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేతలు.. ఎంతో ఇంప్రెస్ అయ్యారు. ఫ్యాన్సీ రేటుతో తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్త హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. 
 
సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది.ఇప్పటివరకు కథానాయిక అంజలిని తన కెరీర్‌లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను చిత్రాంగదలో పోషిస్తుంది. టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. 
 
కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం గీతాంజలి తర్వాత అంజలి నటిస్తున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్న ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం. ఈ నెలాఖరులో ఆడియోను, డిసెంబరు మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబరులో మోహన్ లాల్ 'మన్యం పులి'