Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Advertiesment
surekha vani - supritha
టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత నాయుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ఈ తల్లీకూతుళ్లు స్నేహితుల్లా కలిసి ఉండటం, సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. ఇటీవల సుప్రీత తన తల్లి భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. భర్త మరణం తర్వాత సురేఖ వాణి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తల్లి గురించి సుప్రీత మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకునే ముందు, నా అమ్మకు జీవితంలో ఒక మంచి తోడు ఉండాలి. ఆమెను ప్రేమగా చూసుకునే, గౌరవించే వ్యక్తి రావాలి. అమ్మ సంతోషమే నాకు ముఖ్యం. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. 
 
నాన్న స్థానాన్ని మరెవరికి ఇవ్వాలని ఆమెకు ఇష్టం లేదు. ఆమెను బలవంతం చేయను. కానీ అమ్మ ఒంటరిగా ఉండకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నాను" అంటూ సుప్రీత తెలిపిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి భవిష్యత్తు కోసం ముందుగా ఆలోచిస్తున్న సుప్రీత నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్