Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేను నటించిన సినిమాలు వస్తుంటే వెంటనే ఛానల్‌ మార్చేస్తా' : ప్రియాంకా చోప్రా

ఇప్పటికే ఇంటర్నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయింది ప్రియాంకా చోప్రా. ఆమె చేసిన ఇంగ్లిష్ వీడియో ఆల్బమ్స్‌కు మంచి పేరొచ్చింది. దీంతో ప్రియాంక ఫోకస్ మొత్తం హాలీవుడ్ పైనే పెట్టిందీ భామ. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌

Advertiesment
change
, గురువారం, 13 అక్టోబరు 2016 (14:12 IST)
ఇప్పటికే ఇంటర్నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయింది ప్రియాంకా చోప్రా. ఆమె చేసిన ఇంగ్లిష్ వీడియో ఆల్బమ్స్‌కు మంచి పేరొచ్చింది. దీంతో ప్రియాంకా ఫోకస్ మొత్తం హాలీవుడ్ పైనే పెట్టిందీ భామ. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకుంటుంది ప్రియాంకా చోప్రా. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ''క్వాంటికో''లో తనదైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.

హాలీవుడ్‌లో అవకాశం వచ్చిన తర్వాత ప్రియాంకా రూట్ మార్చేసింది. బాలీవుడ్‌లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ హాలీవుడ్‌లో ఏ రేంజ్ లో అయిన అందాలు ఆరబోయవచ్చు. క్వాంటికో టీవీ సిరీస్‌లో అందాలు ఒలకబోస్తూ యాక్ట్ చేసిన ప్రియాంకా చోప్రాను చూసి అక్కడి వాళ్లు స్టన్ అయ్యారు.
 
తన అందచందాలతో వాళ్లను కట్టిపడేసింది. దాంతో హాలీవుడ్‌లో ప్రియాంకాకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్‌లో విచ్చలవిడిగా నటించవలసి వస్తుందని, అందుకు తనకు అభ్యంతరం లేదని ప్రియాంకా చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే... ప్రియాంకా నటించిన సినిమాలు.. టీవీ షోలు చూసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటే.. ప్రియాంకాకి మాత్రం తాను నటించిన సినిమాలు.. షోలు టీవీల్లో వస్తే చూడటం అస్సలు ఇష్టం ఉండదంటోంది.

ఇదే విషయాన్నిఆమె మీడియాతో వెల్లడించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ప్రియాంకా చోప్రా... తన కెరీర్‌లో ''ఫ్యాషన్'', ''మేరీకోమ్''‌, ''బాజీరావ్‌ మస్తానీ'', ''జై గంగాజల్‌'' తదితర చిత్రాల్లో నటించి అందరి మన్ననలను పొందింది. ''సినిమా సినిమాకి నటిగా పరిపక్వత చెందుతూ వస్తున్నాను. అందుకే గతంలో నటించిన సినిమాలు చూడటం ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడైనా టీవీ చూస్తున్నపుడు నేను నటించిన సినిమాలు వస్తుంటే వెంటనే ఛానల్‌ మార్చేస్తా'' అని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడిని నమ్ముకున్న చిరంజీవి... 150వ చిత్రం హిట్ కోసం...