తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. ఈమె 'కుమారి 21ఎఫ్' చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అందాలను ఆరబోసింది. ఫలితంగా ఓవర్‌నైట్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా అయిపోయింది.
ఆ తర్వాత వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంది. అయితే ఇటీవల హెబ్బా కెరీర్ నెమ్మదించింది. అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల నితిన్ 'భీష్మ' సినిమాలో చిన్న పాత్ర చేసింది. కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపించింది.
అయితే ఆ రెండు సీన్లలోనూ హాట్‌గా కనిపించింది. యంగ్ హీరో రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "రెడ్" సినిమాలో కూడా హెబ్బా కనిపించనుందట. కొన్ని సీన్లతోపాటు ఓ ఐటెం సాంగ్‌లో కూడా మెరవనుందట. ఈ ఐటెం సాంగ్‌లో హెబ్బా మరింత హాట్‌గా కనిపించనుందట. 'రెడ్' సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట.