దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రేమ జంట గురించి తెలిసిందే. ఈ జోడీ ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే దివ్వెల మాధురి.. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనుందని సమాచారం.
అయితే.. మాధురి సమేతంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారని కొంతమంది అంటున్నారు. కపుల్ కోటాలో వీరిద్దరూ ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వస్తోంది. కానీ ఇంకొంత మంది మాత్రం దువ్వాడ కాకుండా మాధురి మాత్రమే బిగ్ బాస్‌కి వెళుతుందంటూ అంటున్నారు.
ఇప్పటికే ఆమె కన్ఫర్మ్ కూడా అయినట్టు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ తర్వాత పవన్ కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి, శ్వేతా శెట్టి వంటి వారు ఓటింగ్‌లో ఉన్నారు. ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయినట్లు బయటి ప్రపంచానికి తెలిసింది.
దీనిపై అతని ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి. అత్యధిక ఓట్లు సాధించినా అతనెందుకు ఎలిమినేట్ అయ్యాడు, అసలు ఈ ఎంపిక ప్రక్రియ ఏంటి అనే విషయాలు రాబోయే ఎపిసోడ్స్‌లో వెల్లడి కానున్నాయి.