బాలకృష్ణ గుండు ఎందుకు చేయించుకున్నాడో తెలుసా..?

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (13:41 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ గుండుతో ఉన్న స్టిల్ బయటకు వచ్చింది. ఈ స్టిల్ ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైరల్ అయ్యింది. దీంతో ఎందుకు బాలయ్య గుండు గెటప్‌లో దర్శనిమిచ్చాడు. సినిమా కోసం గెటప్పా..? లేక వేరే కారణం ఏమైనా ఉందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించారు. 
 
ఈ సినిమాలో బాలయ్యకు విగ్గు కరెక్ట్‌గా సెట్ కాలేదు. దీంతో  తదుపరి సినిమా లుక్ విషయంలో బాలయ్య చాలా కేర్ తీసుకుంటున్నారట. బోయపాటి కూడా బాలయ్య లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. అయితే... బాలయ్య గుండుతో ఉన్న స్టిల్ బయటకు రావడం.. ఇంతకుముందు ఎన్నడూ బాలయ్యను ఇలా చూసి ఉండకపోవడంతో... ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ స్టిల్ చూసిన అభిమానులందరిలో ఒకటే డౌటు. బోయపాటి సినిమాలో బాలయ్య ఇలా కనిపించనున్నారా..? అందుకోసమే ఈ లుక్కా..? లేక వేరా కారణం ఏమైనా ఉందా..? అని. తీరా ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే... రూలర్‌లో బాలయ్యకు విగ్గు సెట్ కాకపోవడంతో.. బాలయ్య హెయిర్ ట్రాన్సప్లెంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నారట. 
 
అది కూడా... ఇక్కడ ఎక్కడా కాదండోయ్.. దుబాయ్‌లో చేయించుకోవాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని... మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
 అందుకోసమే ఇలా గుండు చేయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బోయపాటి ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులు ఎంపిక జరుగుతుందట. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్యకు ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్.. రీ ఎంట్రీ అదిరిపోతుందా?