మళయాళ దర్శకుడు స్నేహజిత్‌పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూనిట్ అంతా చూస్తుండగానే తన బట్టలు విప్పించాడని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే దైవం సాక్షి అనే సినిమా షూటింగ్ కేరళలోని తొడుపుళ అనే ప్రాంతంలో జరుగుతోంది.
దుస్తులు విప్పే సీన్ ఉన్నట్లు తనకు ముందుగా చెప్పలేదని, స్క్రిప్టులో కూడా ఎక్కడా అలా లేదని తర్వాత తనను షూటింగ్ స్పాట్లో యూనిట్ సభ్యుల అందరి ముందు దుస్తులు విప్పించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముందుగా తొడుపుళ పోలీస్ స్టేషన్‌లోని మహిళా విభాగంలో ఈ కేసు నమోదు చేశారు. తర్వాత కలియార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ హీరోయిన్ పేరు పోలీసులు బయట పెట్టలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.