బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అతి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. రష్యా మోడల్ లులియా వంతూర్‌తో తన జీవితాన్ని పంచుకోడానికి సిద్ధమైనట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గత కొన్ని రోజులుగా లులియాతో ప్రేమాయణం సాగిస్తున్న సల్మాన్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. గత కొన్ని రోజులుగా సల్మాన్ లులియాను బాలీవుడ్‌లో అందరికీ పరిచయం చేస్తున్నాడట. ఇదిలావుంటే ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ సందర్భంగా సల్మాన్ తన ప్రియురాలు లులియా వంతూర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు.
అయితే తన పెళ్లి ప్రకటనను బాలీవుడ్ సుందరి ప్రీతి జింటా వివాహ రిసెప్షన్‌లో అందరికి తెలిపాడని బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సల్మాన్‌కి ఇది తొలి వివాహం. కానీ లులియా వంతూర్‌కి ఇది రెండో వివాహం. రోమేనియాకి చెందిన లులియా వంతూర్ మోడల్‌గా పని చేసే సమయంలోనే రొమేనియన్ సూపర్ స్టార్ మారిసయ్ మెగాను పెళ్లాడింది.
నాలుగేళ్ల వీరి దాంపత్యం బెడిసికొట్టడంతో విడాకులు తీసుకున్నారు. కాగా పెళ్లెప్పుడు చేసుకుంటారు అని సన్నిహితులు, మీడియా అడిగినప్పటికి పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దీంతో సల్లూబాయ్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.