కేంద్ర మాజీమంత్రి, టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈయనను వెంటనే బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో కొన్నాళ్లుగా బాధపడుతున్న కృష్ణంరాజు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ సోమరాజు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాక డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక యంగ్ రెబల్ స్టార్ 'బాహుబలి' ప్రభాస్ దాదాపు గంట సేపు ఆసుపత్రికి వెళ్లి పెద్దనాన్న యోగ క్షేమాలు తెలుసుకొని ఆస్పత్రిలోనే గడిపారు.