ప్రజెంట్ తమన్ టైమ్ నడుస్తుంది. ఇటీవల అల.. వైకుంఠపురములో సినిమాకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎంత బాగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అలాగే వెంకీ మామ సినిమాకి కూడా తమనే మ్యూజిక్. ఈ సినిమాలో పాటలు కూడా యూత్‌ని బాగా అలరిస్తున్నాయి. ఈవిధంగా తమన్ బ్రేకులు లేకుండా జెట్ స్పీడుతో దూసుకెళుతున్నాడు.
ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పాటను రీసెంట్‌గా రిలీజ్ చేసారు. ఈ పాట ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని సోషల్ మీడియాలో దేవిశ్రీ పైన సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు. దూసుకెళుతున్న తమన్ మెల్లగా దేవిశ్రీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి ఎక్కువగా దేవిశ్రీనే ఎంచుకుంటాడు. అయితే.. తాజాగా బాలకృష్ణతో చేయనున్న సినిమాకి మంచి ఫామ్‌లో ఉన్న తమన్‌కే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో దేవిశ్రీ టెన్షన్ పడుతున్నాడని... సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి.. రాక్ స్టార్ దేవి అద్భుతమైన మ్యూజిక్‌తో మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆశిద్దాం.