మరోమారు జోడీ కట్టనున్న కింగ్ ఖాన్ - దీపికా పదుకునే
'ఓం శాంతి ఓం'తో హీరోయిన్‌గా బాలీవుడ్ తెరపై మెరిసిన దీపికా పదుకునె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీసు బద్దలు కొ
'ఓం శాంతి ఓం'తో హీరోయిన్‌గా బాలీవుడ్ తెరపై మెరిసిన దీపికా పదుకునె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌తో మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీసు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ''చెన్నైఎక్స్‌ప్రెస్'', ''హ్యాపీ న్యూ ఇయర్'' వంటి సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ ఆన్‌స్క్రీన్ జోడీగా పేరు సంపాదించుకున్నారు.
తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్న ఓ చిత్రంలో షారుఖ్, దీపికా జోడీ కడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే దీపికాతో దర్శకుడు సంప్రదింపులు జరిపాడని.. ఇంకొద్ది రోజుల్లోనే దీపికా షూటింగ్‌కి హాజరవుతుందని బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.