Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా నిశ్చితార్థ ఉంగరం పోయింది.. దాని విలువ రూ.12 లక్షలు.. హీరో విక్రమ్ కుమార్తె ఫిర్యాదు

కోలీవుడ్ హీరో 'చియాన్' విక్రమ్ కుమార్తె అక్షిత వివాహ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌కి, అక్షిత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ శుభకార్యం జరిగి

Advertiesment
Tamil superstar
, బుధవారం, 3 ఆగస్టు 2016 (12:55 IST)
కోలీవుడ్ హీరో 'చియాన్' విక్రమ్ కుమార్తె అక్షిత వివాహ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌కి, అక్షిత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అక్షిత, రంజిత్‌ల వివాహం 2017లో జరగనుంది. 
 
ఇదిలా ఉంటే నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్‌లు మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఖాదర్‌ నవాజ్‌ ఖాన్‌ రోడ్డులోని ఓ ఐస్‌క్రీం పార్లర్ వెళ్లి వస్తుండగా చేయి చూసుకునే సరికి చేతికి ఉంగరం లేదని.. దాని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అక్షిత ఫిర్యాదులో వెల్లడించారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఐస్‌క్రీం పార్లర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలే ఆయన పెద్ద డైరెక్టర్... నేను ఎలా బుట్టలో పడేశానో తెలుసా.. లవ్ స్టోరీ చెప్పిన రోజా