రాయె రాయె రాయె 'సలోని' అంటూ మళ్లీ వస్తోంది.. ‘సినీ మహల్’ ఐటం సాంగ్...
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి - హీరో సునీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మర్యాదరామన్న. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సలోని నటించింది. ఈ చిత్రంలో ‘రాయె రాయె రాయె సలోని’ అంటూ సునీల్ పాడిన సాంగ్‌ను సినీ ప్రేక్షకు
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి - హీరో సునీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మర్యాదరామన్న. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సలోని నటించింది. ఈ చిత్రంలో ‘రాయె రాయె రాయె సలోని’ అంటూ సునీల్ పాడిన సాంగ్‌ను సినీ ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేం.
ఈ చిత్రం ఒక్క సునీల్‌కు మాత్రమే కాదు.. సలోనికి కూడా మంచి హిట్ వచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ అమ్మడు వెండితెరపై కనిపించకుండా పోయింది. కానీ, ఐటెమ్ నంబర్లలో కనిపిస్తూ హల్‌చల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ భామ స్పెషల్ సాంగ్ చేసిన ‘సినీమహల్’ రిలీజ్‌కి వస్తోంది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో సలోని అందాలు కనివిందు చేస్తాయని చెబుతున్నారు.
కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన ‘సినీ మహల్’ ('రోజుకు 4 ఆటలు' అనేది ఉపశీర్షిక) సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘మయూరి’ ద్వారా ఈనెల 31వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని నాయకానాయికలుగా లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర సహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది.