Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వడివేలుతో శ్రియ ఏం చేసిందో... ఇప్పుడు నయనతార కూడా అదే చేయబోతోందట....

సినిమాల్లో నటించేవారు ఒక్కోసారి బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటూ వుంటారు. పెద్ద హీరోలతో నటించే కొందరు హీరోయిన్లు వున్నట్లుండి అప్పుడే వెండితెరపై కాలుపెట్టిన చిన్న హీరోతో సినిమాలు చేసేస్తుంటారు. ఇది ఇప్పటి విషయం కాదు... పాత తరం నుంచి వస్తున్న విషయమే. తాజాగా

Advertiesment
nayanatara acts with kollywood suri
, గురువారం, 23 మార్చి 2017 (14:46 IST)
సినిమాల్లో నటించేవారు ఒక్కోసారి బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటూ వుంటారు. పెద్ద హీరోలతో నటించే కొందరు హీరోయిన్లు వున్నట్లుండి అప్పుడే వెండితెరపై కాలుపెట్టిన చిన్న హీరోతో సినిమాలు చేసేస్తుంటారు. ఇది ఇప్పటి విషయం కాదు... పాత తరం నుంచి వస్తున్న విషయమే. తాజాగా సెక్సీతార నయనతార కూడా ఇలాంటిదే చేయబోతోందట. అంతకుముందు శ్రియ కూడా ఇలాంటిదే చేసి చేతులు కాల్చుకున్నదట. 
 
ఇంతకీ శ్రియ చేసిందేంటయ్యా.. అంటే తన కెరీర్ పీక్ స్టేజిలో వున్నప్పుడు తమిళ హాస్య నటుడు వడివేలుతో కలిసి ఐటమ్ సాంగులో డ్యాన్స్ చేసింది. అంతే... కెరీర్ కాస్త టప్ మంటూ కిందపడిపోయి క్యారెక్టర్ ఆర్టిస్టు స్థాయికి దిగజారింది. ఇప్పుడు అదే ధైర్యం నయనతార చేయబోతోందంటున్నారు కోలీవుడ్ జనం. 
 
ఇప్పుడిప్పుడే కాస్త పేరు తెచ్చుకుంటున్న కోలీవుడ్ నటుడు సూరితో నయనతార నటించేందుకు డిసైడ్ అయ్యిందట. దీనిపై కోలీవుడ్ జనం ఒకటే టెన్షన్ అవుతున్నారు. అంత చిన్న నటుడితో నటిస్తే నయనతార కెరీర్ ఏంకానూ... అని. ఐతే నయనతార మాత్రం తనది హీరో రేంజ్ అని బడాయిలు పోతోందట. మరి చివరికి ఏం చేస్తుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 6500 స్క్రీన్స్‌పై "బాహుబలి-2" రిలీజ్.. ఓవర్సీస్‌లో మరో వెయ్యి స్క్రీన్స్...