Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు కాళ్లపై ఎదగాలని వస్తే నాలుగు కోళ్ల నవ్వారుపైకి రమ్మంటున్నారు.. లక్ష్మీరాయ్ ఆవేదన

నటనారంగంలో పేరు తెచ్చుకుని రెండు కాళ్లపై నిలబడి ఒక కెరీర్‌ను నిర్మించుకోవాలని అమ్మాయిలు ఆశతో వస్తే నాలుగు కోళ్ల నవ్వారు మంచంపైకి రావాలంటున్నారని సినీనటి రాయ్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి డొంకతిరుగుడు మాటలు లేకుండా ఆమె చెబుతున్న మాటల్ని బట్టి,

Advertiesment
రెండు కాళ్లపై ఎదగాలని వస్తే నాలుగు కోళ్ల నవ్వారుపైకి రమ్మంటున్నారు.. లక్ష్మీరాయ్ ఆవేదన
హైదరాబాద్ , గురువారం, 18 మే 2017 (03:36 IST)
నటనారంగంలో పేరు తెచ్చుకుని రెండు కాళ్లపై నిలబడి ఒక కెరీర్‌ను నిర్మించుకోవాలని అమ్మాయిలు ఆశతో వస్తే నాలుగు కోళ్ల నవ్వారు మంచంపైకి రావాలంటున్నారని సినీనటి రాయ్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి డొంకతిరుగుడు మాటలు లేకుండా ఆమె చెబుతున్న మాటల్ని బట్టి,  సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్త అమ్మాయిలు పడక సుఖం అందించకపోతే అవకాశాలే లేకుండా చేస్తున్నారని బోధపడుతోంది. అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం చిత్ర పరిశ్రమలో ఉనికిలో ఉందని లక్ష్మీరాయ్ తేల్చి చెప్పారు.
 
ఏ రంగంలో అయినా ఎదగాలంటే తమ కెరీర్‌ను కష్టంతో అల్లుకోవాలి. కానీ, ఇక్కడేమో అమ్మాయిల కెరీర్‌ను నవ్వారుతో అల్లేస్తున్నారు. ఎన్నో కలలు, ఆశలతో రంగుల లోకంలో అకాశమంత ఎత్తుకి ఎగరాలని వచ్చినోళ్లను రెండు కాళ్లపై ఎదగనివ్వక నాలుగు కోళ్ల నవ్వారుపైకి రావాల్సిందేనంటున్నారు! ఈ మాటలంటున్నది ఎవరో కాదు... రత్తాలు రాయ్‌ లక్ష్మి. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) ఉందన్నారామె.
 
‘‘కోటి ఆశలతో ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలను, హిట్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్‌ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి సరదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసమే (స్లీప్‌ అరౌండ్‌) వస్తారు’’ అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు రాయ్‌ లక్ష్మి. 
 
‘‘తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదు. తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమా నుంచి తప్పిస్తున్నారు’’ అని బోల్డ్‌గా చెప్పేశారీ బ్యూటీ. ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అన్ని ఇండస్ట్రీలలోనూ ఉందన్నారు. నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. 
 
కొన్ని దశాబ్దాలుగా చిత్రసీమలో అమ్మాయిలకు కలుగుతున్న దారుణమైన అనుభవాలను సమాజం కథలుకథలుగా చెప్పుకుంటూనే వస్తోంది. అవన్నీ సత్యం కాదని, పుకార్లు అని, ఎవరొ కొందరు సృష్టిస్తున్న గాలి పోగు వార్తలు అని బయటి సమాజం భావించేది. కానీ లక్ష్మీరాయ్ మాటలు వింటూంటే అవి పుకార్లు కాదని, కళ పేరుతో అమ్మాయిల శరీరాలతో మాంస వ్యాపారం చేసేవారు చిత్రసీమలో కొనసాగుతున్నారని స్పష్టమవుతోంది.

కెరీర్ కోసం శరీరాన్ని ఫణంగా పెట్టవలసి వస్తున్న యువతుల పట్ల కాస్త జాలి పడటం సంస్కారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందల కోట్లు పెడతారు నిజమే.. రాజమౌళిలా ఎమోషన్స్ పండించే దర్శకుడు.. ప్రభాస్ లాంటి నిబద్ధ నటులు ఎక్కడ?