Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వందల కోట్లు పెడతారు నిజమే.. రాజమౌళిలా ఎమోషన్స్ పండించే దర్శకుడు.. ప్రభాస్ లాంటి నిబద్ధ నటులు ఎక్కడ?

భారతీయ చిత్ర సంస్కృతిలో మానవ భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబలి-2 ద్వారా రాజమౌళికి దక్కింది. రాజమౌళి దార్శనికతను నటనద్వారా పండించడంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కట్టప్ప, బిజ్జలదేవుడు తదితరులు ఎంత అంకిత భావంతో పనిచేశారో బాహుబలి-2

Advertiesment
వందల కోట్లు పెడతారు నిజమే.. రాజమౌళిలా ఎమోషన్స్ పండించే దర్శకుడు.. ప్రభాస్ లాంటి నిబద్ధ నటులు ఎక్కడ?
హైదరాబాద్ , గురువారం, 18 మే 2017 (02:24 IST)
భారత చలనచిత్ర చరిత్రలో అత్యద్భుత విజయాలను లిఖిస్తున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా పలు భాషా చిత్ర దర్శకులను, నిర్మాతలను, హీరోలను తెగ ఊరిస్తోంది. చిత్రాన్ని గ్రాండ్‌గా తీసినా వందల కోట్లు ఖర్చుపెట్టినా నష్టం రాకుండా బాహుబలిలా విజయం సాధించవచ్చనే నమ్మకం భారత్‌లోని అన్ని భాషల చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఏర్పడ్డానికి కారణం ప్రేరణ బాహుబలి-2 అంటే సందేహించాల్సిన అవసరం లేదు.


దేశీయంగా ఒక చిన్న ప్రాంతమైన కేరళలో మోహన్ లాల్  భీముడి పాత్ర ధారిగా వెయ్యి కోట్లు కర్చుపెట్టి మహాభారతాన్ని తీయడానికి దుబాయ్ ఎన్నారై పూనుకున్నా. టాలీవుడ్‌లో అల్లు అరవింద్ 500 కోట్లు వెచ్చించి మహాభారతాన్ని 3 భాగాల  సినిమాగా తీస్తానని ప్రకటించినా, ఇంతవరకు కన్నడ సరిహద్దులు దాటని కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు బాహుబలి అద్భుత విజయం ప్రేరణతో తన చరిత్రలోనే అతి భారీ చిత్రంగా కురుక్షేత్రను తీయడానికి సాహసించినా అది బాహుబలి-2 ప్రభావమే. 
 
దమ్ములుంటేనే వైభవం లేకుంటే లేదు. ఇదే బాహుబలి-2 విజయం నేర్పుతున్న పాఠం, అని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమాను చూడకుండానే ప్రశంసలు కురింపించడం, ప్రభాస్‌కు వంద కోట్లు ఆపర్ చేసి హిందీ సినిమా తీయడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సాహసించినా అది బాహుబలి కలిగించిన ప్రేరణే.
 
కానీ ఇన్ని ప్రేరణల మధ్య ఒక సందేహం పొడుచుకుని వస్తోంది. ఇలా అతి బారీ బడ్జెట్ సినిమాల కేసి చూస్తున్న నిర్మాతలు ఎవరి దర్శకత్వంలో తమ భారీ సినిమాలు తీయాలనుకుంటున్నారో స్పష్టం కావడం లేదు. భారతీయ చిత్ర సంస్కృతిలో మానవ భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబలి-2 ద్వారా రాజమౌళికి దక్కింది. రాజమౌళి దార్శనికతను నటనద్వారా పండించడంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కట్టప్ప, బిజ్జలదేవుడు తదితరులు ఎంత అంకిత భావంతో పనిచేశారో బాహుబలి-2 సినిమాలో ప్రతి ప్రేమ్ కూడా మనకు చూపిస్తోంది. నాటకీయతతో కూడిన ఉద్వేగ సన్నివేశాలను బాహుబలి-2లో రాజమౌళి ఎంత అద్భుతంగా చూపించారంటే ప్రేక్షకులు నీరాజనాలు అర్పిస్తున్నారు. 
 
బాహుబలి-2 సినిమాలో గంభీరమైన దృశ్యాలలో వచ్చే శక్తివంతమైన డైలాగులను చూసి ధియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడంతో సరిపెట్టుకోవడం లేదు ఒక్కో డైలాగ్ తమ హృదయాలను కదిలిస్తుంటే శరీరం నిలువెల్ల ఒణికి పోయేలా విలపిస్తున్నారు. అదే రాజమౌళి సినిమాలకు ఇతరుల సినిమాలకు ఉన్న తేడా. భావోద్వేగాలను ఇంత హృద్యంగమంగా, ఇంత పరితాపం కలిగించేలా తీసిన దర్శకుడు మన చలనచిత్ర చరిత్రలో మరెవ్వరూ లేరనిపిస్తోంది. ఒకచోట బలమైన సన్నివేశం పండించడం కాదు.. సినిమా నడిచే కొద్దీ ప్రతి సీన్‌లో ఉద్వేగంతో ప్రేక్షకులు కదిలిపోవడం ఈ మధ్య కాలంలో ఇంత స్థాయిలో ఎక్కడా చూడలేదు. 
 
అన్నిటికంటే మించి రాజరికాన్ని, రాజసాన్ని ప్రజలను ప్రేమించడం ద్వారా, ఇచ్చిన మాటకోసం రాజ్యాన్ని సైతం తృణప్రాయంలా త్యజించడం ద్వారా ప్రభాస్ చూపిన ఉదాత్త నటనను ఎవరు ప్రదర్శించగలరు. అరుంధతి, రుద్రమదేవిలను మించిన ఔద్ధత్యాన్ని, రౌద్రాన్ని, కరుణను, నయగారాన్ని అనితరసాధ్యంగా ప్రదర్శించిన మరో అనుష్కను ఈ మెగా ప్రాజెక్టుల నిర్మాతలు ఎక్కడినుంచి తీసుకురాగలరు? కుంతలదేశ యువరాణి దేవసేనిగా అనుష్క పండించిన నటరాజసాన్ని ఎవరు పూరించగలరు? భారత దేశం మొత్తం దేవసేన పాత్రలో అనుష్క రూపలావణ్యాలను చూసి మైమర్చిపోతోంది. బాహుబలి 2 అఖండ విజయంలో అనుష్క పాత్ర సామాన్యమైనది కాదు.. ఇక పోతే.. రాజమాతగా తన ఔద్ధత్యాన్ని, అహంభావాన్ని అమరేంద్ర బాహుబలి మరణానికి కారణమైన తన తొందరపాటును ప్రశ్చాత్తప్త దగ్ధ హృదయంతో దేవసేన పాదాలను కడిగి శివగామి పాత్ర ద్వారా పండించిన పరమ పునీత నటనతో కోట్లమందిని చివరలో విలపించేలా చేసిన రమ్యకృష్ణ లాంటి నవరస నటనా విదుషీమణిని ఎక్కడి నుంచి తీసుకు వస్తారు?
 
అందుకే 500 కోట్లు, వెయ్యి కోట్లు పెట్టుబడితో రావడం కాదు. ఎలాంటి కథను సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరు తీస్తున్నారు. ఎవరు నటిస్తున్నారు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే మాత్రం ఇన్ని వందల కోట్ల మెగా ప్రాజెక్టులు అన్ని భాషల్లోనూ కుప్పకూలడం, నిర్మాతల కొంప ముంచడం ఖాయం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి' వంటి కథలు వద్దంటున్న ఎస్ఎస్.రాజమౌళి.. ఎందుకో తెలుసా?